మే 27 ను పెయిడ్ హాలిడేగా ప్రకటించాలి!.. ఈసీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వినతి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ తేదీని పెయిడ్ హాలిడే గా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్ధించారు.

Update: 2024-05-22 12:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ తేదీని పెయిడ్ హాలిడే గా ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎన్నికల సంఘాన్ని అభ్యర్ధించారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను వర్కింగ్ డే అయిన మే 27 న నిర్వహించారని, ఆ రోజును ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించాలని సీఈఓ వికాస్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు.

వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి చెందిన కొందరు గ్రాడ్యూయేట్ ఓటర్లు ఎన్నికల తేదీ పని దినం అని తనకు తెలిపారని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల తేదీని చెల్లింపు సెలవుగా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు. అంతేగాక ఉద్యోగి ఓటర్ ఐడీని చూపించి యాజమాన్యం మే 27 న పెయిడ్ హాలిడే గా పరిగణించవచ్చని తెలిపారు. తద్వారా అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఓట్ల శాతం కూడా మెరుగుపడుతుందని ఈసీకి బల్మూరి వెంకట్ తెలియజేశారు.

Similar News