ప్రజలను వేధిస్తున్నారనే దాడి చేశాం: మావోయిస్టులు

అమాయకులైన గ్రామీణులపై భద్రతా బలగాలు చేస్తున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగానే అరన్ పూర్ రోడ్డులో పోలీసులను టార్గెట్ చేసి మందుపాతర పేల్చినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Update: 2023-04-28 07:47 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : అమాయకులైన గ్రామీణులపై భద్రతా బలగాలు చేస్తున్న దాడులు, అత్యాచారాలకు నిరసనగానే అరన్ పూర్ రోడ్డులో పోలీసులను టార్గెట్ చేసి మందుపాతర పేల్చినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు దర్భా డివిజన్ కమిటీ అధికార ప్రతినిధి సాయినాథ్ ప్రకటన Maoist party issued a key statementవిడుదల చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి సహజ సంపదను దేశ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టటానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే సైనిక, ఎన్ ఎస్జీ, డీఆర్జీ, కొబ్రా టీములను రంగంలోకి దింపి బస్తర్ ను సైనిక క్యాంపుగా మార్చివేశాయని పేర్కొన్నారు. ఈ బలగాలు అమాయకులైన గ్రామీణులపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. దీనికి నిరసనగానే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చినట్టు తెలిపారు. డీఆర్జీలో చేరవద్దని యువకులకు సూచించారు. లేనిపక్షంలో ఇలాంటి పరిణామలే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Tags:    

Similar News