ఎట్టకేలకు క్రిషాంక్‌కు బెయిల్ మంజూరు.. నాంపల్లి కోర్టులో ఊరట

ఎట్టకేలకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది.

Update: 2024-05-10 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. శుక్రవారం నాంపల్లి కోర్టు బెయింల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం క్రిషాంక్ చంచల్ గూడ జైల్లో ఖైదీగా ఉంచారు. ప్రతిరోజు పోలీసుల ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్, నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఓయూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారు. కోర్టు అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. క్రిషాంక్‌ వర్సిటీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేశారని ఓయూ అధికారుల ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల పోలీసులు కేసు నమోదు చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News