వట్టెం దేవాలయంలో మహేశ్ బాబు భార్య నమ్రత ప్రత్యేక పూజలు

మండల పరిధిలోని వట్టెం వెంకన్న ఆలయానికి హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Update: 2023-03-07 09:20 GMT

దిశ, బిజినేపల్లి: మండల పరిధిలోని వట్టెం వెంకన్న ఆలయానికి హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకముందు అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. వట్టెం దేవస్థానం ఎంతో పవిత్రమైందని, దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని అన్నారు. ఇక్కడకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు.

Tags:    

Similar News