నారాయణ పేట జిల్లా ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులు ఇంకెప్పుడు ?

నూతనంగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ నూతన కార్యాలయాల ఏర్పాటుతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు గత కొన్ని రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ సింగారం చౌరస్తా వద్ద 2023 జనవరి 24న శంకుస్థాపన చేశారు.

Update: 2023-06-23 14:35 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి : నూతనంగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ నూతన కార్యాలయాల ఏర్పాటుతో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు గత కొన్ని రోజుల క్రితమే మంత్రి కేటీఆర్ సింగారం చౌరస్తా వద్ద 2023 జనవరి 24న శంకుస్థాపన చేశారు. మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే కలెక్టరేట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కలెక్టరేట్ నిర్మాణ వేగవంతం కోసం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కానీ జిల్లా పోలీస్ కార్యాలయ ఏర్పాటుకు సుమారు రూ.38 కోట్ల 50 లక్షల నిధులు అందుబాటులో ఉన్నా ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ఎస్పీ కార్యాలయానికి కేటాయించిన స్థలం పై కోర్టు కేసుల కారణంగానే జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు ఉట్కూరు మండలం వల్లంపల్లి రోడ్ మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన స్థల ప్రొసీడింగ్స్ ను పోలీస్ శాఖకు గతంలోనే అప్పగించారు. నూతనంగా ఏర్పాటైన నారాయణపేట జిల్లాలో శాంతిభద్రతలు మరింత పటిష్టత, మెరుగైన పోలీస్ శాఖ సేవల కోసం ఎస్పీ కార్యాలయ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News