కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య..

కడుపునొప్పి భరించలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నవాబుపేట మండల పరిధిలో జరిగింది.

Update: 2023-04-23 15:55 GMT

దిశ, నవాబుపేట: కడుపునొప్పి భరించలేక ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నవాబుపేట మండల పరిధిలో జరిగింది. ఎస్ఐ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కూచూరు గ్రామానికి చెందిన చిట్టె పార్వతమ్మ (45 ) కడుపు నొప్పి భరించలేక ఈ నెల 18వ తేదీన పురుగుల మందు తాగింది. ఇది గమనించిన ఆమె భర్త వెంకటయ్య 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా పార్వతమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందింది. మృతురాలి సోదరుడు కురువ ఎల్లప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News