రెండు వైన్ షాపులలో ఒకే వ్యక్తి చోరీ

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల వైన్ షాప్ తో పాటు తుర్కపల్లి గ్రామానికి చెందిన మాచారం వద్ద ఉన్న సమిష్టి వైన్ షాప్ లో ఒకే వ్యక్తి చోరీకి పాల్పడినట్లుగా సిసి ఫుటేజ్ ల ద్వారా షాప్ యజమానులు గుర్తించారు.

Update: 2024-05-26 16:26 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల వైన్ షాప్ తో పాటు తుర్కపల్లి గ్రామానికి చెందిన మాచారం వద్ద ఉన్న సమిష్టి వైన్ షాప్ లో ఒకే వ్యక్తి చోరీకి పాల్పడినట్లుగా సిసి ఫుటేజ్ ల ద్వారా షాప్ యజమానులు గుర్తించారు. వారు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం అర్ధరాత్రి ఒక గుర్తు తెలియని వ్యక్తి చెడ్డి గ్యాంగ్ మాదిరిగా కేవలం డ్రాయర్ ని ధరించి ఏమాత్రం గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకొని మన్ననూర్ వైన్ షాపులో కి పై భాగం రేకును తొలగించి షాపులోకి వెళ్లిన ఆ వ్యక్తి కౌంటర్లో ఉన్న రూ. 90 వేలు, ఇదే తరహాలో అమ్రాబాద్ రహదారిపై మాచారం గ్రామం వద్ద ఉన్న అరణ్య వైన్ షాపులో చోరీకి పాల్పడి అక్కడ రూ. 60 వేలు కౌంటర్లో తీసుకొని తదుపరి 2 బీరు మద్యం బాటీలను తీసుకెళ్లినట్టుగా సీసీ ఫుటేజ్ లో నమోదు అయిన విషయాన్ని బాధితులు తెలిపారు. ఈ చోరికి సంబంధించి రెండు షాపుల యజమానులు ఆదివారం అమ్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై అమ్రాబాద్ ఎస్సై రమేష్ ను ఫోను ద్వారా దిశ మాట్లాడే ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.

Similar News