మా న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలి..పంచాయితీ కార్యదర్శులు..

తమ న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు పంచాయితీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు.

Update: 2023-04-28 14:23 GMT

దిశ ప్రతినిధి, నారాయణపేట : తమ న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరించాలని పలువురు పంచాయితీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేస్తూ గ్రామాలను దేశంలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా తెలంగాణను ముందు ఉంచడం జరిగిందని పేర్కొన్నారు.

జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, తమను రెగ్యులరైజ్ చేసి సీనియర్ అసిస్టెంట్ పెస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విధి నిర్వహణలో మరణించిన పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి బాధిత కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన కార్యక్రమంలో శ్రీనివాస్, జగదీష్, మహేష్, బస్వరాజ్, విజయ్, భవిత, జ్యోతి, మధురిక, నవిత, లలిత, కళావతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News