పాలమూరు ఎంపీ సీటుపై సీఎంకు భయం పట్టుకుంది : డీకే అరుణ

పాలమూరు ఎంపీ సీటు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో ఉన్న మిగతా పార్లమెంట్ స్థానాల్లో ప్రచారానికి వెళ్లకుండా తుమ్మి నా దగ్గిన పాలమూరు

Update: 2024-04-28 15:20 GMT

దిశ, జడ్చర్ల : పాలమూరు ఎంపీ సీటు పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు భయం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో ఉన్న మిగతా పార్లమెంట్ స్థానాల్లో ప్రచారానికి వెళ్లకుండా తుమ్మి నా దగ్గిన పాలమూరు జిల్లాకు వచ్చి బిజెపిపై అసత్యపు విష ప్రచారాలు చేస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఆయన పాలమూరు జిల్లాలో సభలు కాదు కదా పాలమూరు జిల్లాలో ఉండి నిద్రపోయిన కూడా పాలమూరు పార్లమెంట్లో గెలుపు బిజెపి దేనిని అన్నారు.

ఆదివారం జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్లో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి అధ్యక్షతన నిర్వహించిన పాలమూరు పార్లమెంట్ పరిధిలోని యువ సమ్మేళనం లో డీకే అరుణ, బిజెపి సీనియర్ నేత జాతీయ బీసీ కమిషన్ మెంబర్ టి .ఆచారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదని పరిపాలనపై అవగాహన లేక పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.

పాలమూరులో బీజేపీ అభ్యర్థులకు వస్తున్న ఆదరణ చూసి సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, ఇంకెన్నిసార్లు సీఎం జిల్లాకు వచ్చిన ఉమ్మడి పాలమూరులో బీజేపీ దే విజయం అన్నారు. గ్రామాలలో ఎవరిని కదిలించిన మోడీకే మా ఓటు అంటున్నారని, కార్యకర్తలందరూ ప్రతి ఒక్కరిని కలిపి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధిని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించి ఓటు వేయమని అడగాలని అన్నారు.

అనంతరం జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు బిజెపి సీనియర్ నేత టి ఆచారి మాట్లాడుతూ… కోట్ల రూపాయలు వెదజల్లి తనపై 71 ఓట్లతో గెలిచిన వంశీచంద్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో ఎన్ని కోట్లు తెచ్చుకున్నారో అని ఎద్దేవా చేశారు. ఆయన నిజంగా ప్రజల్లో ఉండే వ్యక్తి అయితే 2023లో కల్వకుర్తి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేయకుండా పది కోట్ల రూపాయలకు కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కసిరెడ్డి నారాయణరెడ్డి కు అమ్ముకున్నాడని, తన స్వార్థం కొరకు ఆలోచించే వ్యక్తి వంశీచంద్ రెడ్డి అని అలాంటి వ్యక్తి పాలమూరు ఎంపీగా ఎన్నికైతే పాలమూరులో అభివృద్ధి అనే పదానికే చోటు లేకుండా పోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి, బీజేపీ సీనియర్ నాయకులు నాగరావ్ నామోజీ, బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరి, రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, బీజేవైఎం పార్లమెంట్ రాము యాదవ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ కిరణ, రమేష్ బీజేవైఎం నారాయణపేట, జిల్లా అధ్యక్షులు భరత్ వనపర్తి, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News