యూపీఎస్సీ పరీక్షలలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరు బిడ్డ

యూపీఎస్సీ 2023 వ సంవత్సరం పరీక్షా ఫలితాలలో పాలమూరు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.

Update: 2024-04-16 10:17 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: యూపీఎస్సీ 2023 వ సంవత్సరం పరీక్షా ఫలితాలలో పాలమూరు జిల్లాకు చెందిన దోనూరు అనన్య రెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు సురేష్ రెడ్డి, మంజులత పెద్ద కుమార్తె అయిన అనన్య రెడ్డి తన పాఠశాల విద్య అంతా మహబూబ్ నగర్ పట్టణంలో పూర్తి చేసింది. 6 నుండి 10 తరగతి వరకు గీతం పాఠశాలలో చదివి ఎస్ఎస్సి లో అత్యుత్తమ గ్రేట్ పాయింట్స్ ను సాధించింది. అనంతరం ఆమె హైదరాబాద్ లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో ఇంటర్ పూర్తి చేసింది. ఢిల్లీలోని మిరండా హౌస్ లో డిగ్రీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. మొదటి ప్రయత్నంలోనే తన లక్ష్యాన్ని చేరుకొని జాతీయస్థాయిలో మూడో ర్యాంకును సాధించింది. అత్యుత్తమ ర్యాంకును సాధించడం పట్ల ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News