స్థానిక సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా క్వషన్ అవర్ లో దేవరకద్ర నియోజకవర్గంలోని పలు సమస్యలపై....Latest News

Update: 2023-02-12 09:01 GMT

దిశ, దేవరకద్ర: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా క్వషన్ అవర్ లో దేవరకద్ర నియోజకవర్గంలోని పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. 'దేవరకద్ర నియోజకవర్గంలో ఎనమిది మండలాలు ఉన్నాయని.. ఆ ఎనిమిది మండలాలకు సంబంధించి ఒక డీఎస్పీ ఆఫీస్ ఓపెన్ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి ని రిక్వెస్ట్ చేస్తూ పరిపాలన సౌలభ్యం కోసం నియోజకవర్గంలో కొత్తమండలాలు ఏర్పడ్డాయి కాబట్టి కౌకుంట్ల మండలంలో పోలీస్ స్టేషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు.. మదనపురం, కౌకుంట్ల, మూసాపేట మండలాలకు పోలీస్ స్టేషన్లు, త్వరగా కొత్త భవనాలు మంజూరు చేయాలి' అని మంత్రిని కోరారు. మంత్రి మహమూద్ అలీ స్పందిస్తూ కేబినెట్ లో చర్చించి పోలీస్ స్టేషన్ బిల్డింగులు మంజూరు చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News