అందరి ఆమోదంతోనే గణపసముద్రం రిజర్వాయర్ పనులు చేపడతాం: మంత్రి నిరంజన్ రెడ్డి

అందరి ఆమోదంతోనే గణపసముద్రం రిజర్వాయర్ పనులు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

Update: 2023-05-13 16:55 GMT

దిశ, వనపర్తి: అందరి ఆమోదంతోనే గణపసముద్రం రిజర్వాయర్ పనులు చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం కేంద్రంలోని రైతు వేదికలో మంత్రి నిరంజన్ రెడ్డి  గణపసముద్రం చెరువులోని భూములు గల రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల కోరిక మేరకే సీఎం కేసీఆర్ ను ఒప్పించి గణపసముద్రం చెరువును రిజర్వాయర్ గా పునరుద్ధ రించేందుకు భూసేకరణ కోసం ప్రభుత్వం నుంచి రూ. 24 కోట్లు మంజూరు చేయించామన్నారు.

రిజర్వాయర్ నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు మెరుగైన పరిహారం కోసం కృషి చేస్తామన్నారు. ప్రజలకు, రైతులకు మేలు జరగాలన్నదే నా ఆకాంక్షఅన్నారు. ఎవరికీ అన్యాయం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్.సి మధుసూదన్, డీఈ సత్యనారాయణ గౌడ్, మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News