కాంగ్రెస్ హయాంలోనే ఉపాధి పని పుట్టింది : మంత్రి జూపల్లి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథక కూలీలకు రోజుకు

Update: 2024-05-10 12:25 GMT

దిశ,చిన్నంబావి : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథక కూలీలకు రోజుకు రూ.400 వేతనం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.మండల పరిధిలోని మంత్రి స్వగ్రామమైన పెద్ద దగడలో ఉపాధి కూలీలతో సమావేశమైన మంత్రి పలు అంశాలపై ముచ్చటించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశం అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని,ప్రస్తుతం మీరు చేస్తున్న ఉపాధి హామీ పని గతంలో కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ప్రజలకు ఉపాధి కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో చట్టాన్ని రూపొందించరని ఆ కాలంలోనే పుట్టిందని కూలీలకు వివరించారు.

ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెం:4 పైన మీ అమూల్యమైన ఓటును తప్పక వేయాలని కూలీలను కోరారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వాస్తే ప్రజలకు కల్పించే ఐదు గ్యారెంటీలను ఉపాధి కూలీలకు వివరించారు. రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను అమలుచేశమని రానున్న ఆగస్టులో రైతురూణ మాఫిరూ.2 లక్షలు ఏకకాలంలో పూర్తి చేస్తామని అన్నారు. గత పదేఏళ్లలో బీఆర్ఎస్,బిజెపపార్టీలు ప్రజల చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్,కొత్త కళ్యాణ్ రావు, రాంచంద్రారెడ్డి,మందడి చిదంబర్ రెడ్డి, సురేందర్ సింగ్,రంజిత్,వెంకటేష్,శంకర్,శ్రీను,కిరణ్, జగదీష్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News