బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కారును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కారును కాంగ్రెస్ కార్యకర్తలు

Update: 2024-05-10 16:42 GMT

దిశ, తాడూరు: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కారును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలో రోడ్ షో లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంతో అక్కడ దగ్గర్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం తో ఊగిపోయారు .మర్రి జనార్దన్ రెడ్డి రోడ్ షో ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఆయన కారును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అది గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను తోసేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకున్నారు.

Similar News