రోడ్డు ప్రమాదంలో చిన్నారి మరణం

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని ఎల్కిచర్ల గ్రామములో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అకీర(7) అనే చిన్నారి మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా నుండి నాగర్ కర్నూల్ వైపు

Update: 2023-05-01 08:06 GMT

దిశ, భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని ఎల్కిచర్ల గ్రామములో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అకీర(7) అనే చిన్నారి మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా  నుండి నాగర్ కర్నూల్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. 108లో జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆ చిన్నారి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటనకు సంబంధించి భూత్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News