సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం: ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పదే పదే పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

Update: 2023-03-03 10:01 GMT

దిశ, కొల్లాపూర్: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పదే పదే పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం కొల్లాపూర్ మండలం కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంపును నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్న తరుణంలో భారతదేశంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనైతికంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం దారుణమని అన్నారు. 2014లో రూ. 410 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర, పదే పదే పెంచి ప్రస్తుతం పెంచిన రూ. 50 కలిపి రూ.1,155 కు చేరుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో దాదాపు రూ. 745 లు సిలిండర్ ధర పెరిగిందన్నారు. అన్ని ధరలు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News