శ్రీధర్ రెడ్డి హత్య పై సీబీఐ విచారణ చేపట్టాలి : మాజీ ఎమ్మెల్యే బీరం

మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…

Update: 2024-05-23 10:18 GMT

దిశ,చిన్నంబావి : మండల పరిధిలోని లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ… శ్రీధర్ రెడ్డి హత్య ముమ్మాటికీ రాజకీయ హత్య అని అన్నారు. శ్రీధర్ రెడ్డి మండలంలో మంచి పేరుపొందిన వ్యక్తి ఏలాంటి ఇతర కారణాలు లేవనీ అన్నారు.

తన రాజకీయ ఎదుగుదల గిట్టని కొందరు వ్యక్తులు రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రోద్బలంతోనే హత్య చేశారని, శ్రీధర్ రెడ్డి హత్యపై సీబీఐ విచారణ చేపట్టి సంబంధిత రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని వాటిని కట్టడి చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర డిజిపిని కలిసి నియోజకవర్గంలో జరిగే సంఘటనలను వివరించామని అంతలోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశాడం చాలా బాధాకరమని అన్నారు.

Similar News