ధర్మ స్థాపనలో బసవేశ్వరుడి సేవలు గొప్పవి : డీకే అరుణ

హిందూ ధర్మ స్థాపనలో బసవేశ్వరుడి సేవలు గొప్పవని,

Update: 2024-05-10 14:46 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: హిందూ ధర్మ స్థాపనలో బసవేశ్వరుడి సేవలు గొప్పవని,ఆయన మార్గంలో మనం నడిచినప్పుడే నిజమైన నివాళులర్పించినట్లని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డికె అరుణ అన్నారు.శుక్రవారం బసవవేశ్వర జయంతి సందర్భంగా స్థానిక పద్మావతీ కాలనీలోని బసవేశ్వరుని విగ్రహంకు ఆమె పూలమాలలు వేసి ఘన్నంగా నివాళులర్పించి మాట్లాడారు.ఈ ప్రాంతాల్లో వీరశైవ లింగాయత్ ప్రభావం అధికమని,నేను మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశామని,మా ఇంట్లో వీరశైవ లింగాయత్ ల ఆచారం కొనసాగిస్తున్నామని ఆమె అన్నారు.వీరశైవ లింగాయత్ లకు.ఏ సమస్య వచ్చినా తాను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.దేశ భవిష్యత్తు కోసం జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కెఎస్.రవికుమార్,శివుడు,శ్రీశైలం,రాజసింహుడు,సిద్ధిరామప్ప,లింగంపల్లి చంద్రశేఖర్,గాంధీ,వీరణ్ణ,సిద్ధి లింగం,రాజ్ కుమార్,నాగశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News