కులమతాలకు అతీతుడు బసవేశ్వరుడు : వంశీచంద్ రెడ్డి

కులాలు,మతాలు లేవని మనుషులంతా ఒక్కటే

Update: 2024-05-10 14:00 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కులాలు,మతాలు లేవని మనుషులంతా ఒక్కటే అని,ఆహారం,ఇల్లు,బట్ట,జ్ఞానం,వైద్యం ఇవి మనిషి కనీస హక్కులని బసవేశ్వరుని సిద్ధాంతమని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.శుక్రవారం బసవ జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్థానిక పద్మావతీ కాలనీలోని గ్రీన్ బెల్ట్ దగ్గర ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి ఘన్నంగా నివాళులర్పించి మాట్లాడారు.

బసవేశ్వరుని ఆశయాలు గొప్పవని పొగుడుతూ ఆయన మార్గాన్ని అనుసరించాలని ప్రసంగించే నాయకులు కొందరు రాజకీయ లబ్ధి కోసమే మతాలను రెచ్చగొడుతున్నారని ఆయన పరోక్షంగా బీజేపీ ని విమర్శించారు.సమాజంలో కుల వ్వవస్థను,వర్ణ భేదాలను,లింగం వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదవాది బసవేశ్వరుడని ఆయన ఆశయ సాధనకై మనం ముందుకు సాగుతూ,మతతత్వ పార్టీలకు స్థానం కల్పించకుండా మనుషులంతా ఒక్కటే అనే పార్టీని తమ ఓటు ద్వారా నిరూపించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లింగాయత్ నాయకులు కెఎస్.రవికుమార్,శ్రీశైలం,పోకలు శివుడు,వీరణ్ణ,సిద్ధిలింగం,రాజసింహుడు,సిద్ధిరామప్ప, లింగంపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News