పాలమూరు గొంతుక పార్లమెంటులో వినాలంటే అరుణమ్మ గెలవాలి : అన్నామలై

పాలమూరు జిల్లా ప్రజల సమస్యలు పరిష్కారం

Update: 2024-05-11 12:48 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: పాలమూరు జిల్లా ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్నా,పార్లమెంటులో పాలమూరు గళం వినాలన్నా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచి తీరాలని తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలో పట్టణ వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక గడియారం చౌరస్తాలో ఆయన ప్రసంగించారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలన చూసి ప్రపంచమే నివ్వెరపోతుంటే,ఆయనకు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఓటమి భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరుణమ్మను ఒక మహిళ అని చూడకుండా నోటికొచ్చినట్లు ధుర్భాషలాడుతున్నాడని ఆయన ఆరోపించారు.వారంటీ లేని ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఆయన జోస్యం చెప్పారు.దేశం భద్రంగా ఉండాలన్నా,మరింత అభివృద్ధి చెందాలన్నా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని,మహబూబ్ నగర్ పార్లమెంటు బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి డీకె అరుణ గెలిచితీరాలని,ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ రోడ్ షోలో సీనియర్ నాయకుడు బురుజు రాజేందర్ రెడ్డి,పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News