కళాకారులకు చప్పట్లే ప్రోత్సాహం : భరత్ ప్రసాద్

ఒక సినిమాను నిర్మించాలంటే పగలు రాత్రి తేడా లేకుండా పాత్రలో

Update: 2024-05-22 14:26 GMT

దిశ, నాగర్ కర్నూల్ : ఒక సినిమాను నిర్మించాలంటే పగలు రాత్రి తేడా లేకుండా పాత్రలో విలీనమై డైరెక్టర్ , నిర్మాత, హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు కష్టపడి ఒక సినిమాను నిర్మిస్తారు. వారు పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే మన చప్పట్లే కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని బీజేపీ నాయకులు భరత్ ప్రసాద్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఐ20 సినిమా పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా భరత్ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో జరిగిన సంఘటనలు కథగా తీసుకొని సినిమాలు నిర్మించినందుకు డైరెక్టర్ నిర్మాతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్య రాజ్, సుహానా, డైరెక్టర్, సూరి రవీందర్, నిర్మాత మహేందర్, లిరిక్ రైటర్ దేవేందర్ , ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి, లాలు యాదవ్, నాగర్ కర్నూల్ సినీ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News