కంపెనీ ఏర్పాటుకు అనుమతించిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి : వంశీచంద్ రెడ్డి

ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతించిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-29 08:46 GMT

దిశ, మరికల్: ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అనుమతించిన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కన్మనూర్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ…వాయు, జల కాలుష్యం వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చిత్తనూర్ ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కంపెనీ ఏర్పాటుకు అనుమతినిచ్చింది భారతీయ జనతా పార్టీ, దానికి సహకరించింది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నేనని గుర్తు చేశారు.

మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో బీజేపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పి, కాంగ్రెస్ ను ఆదరించాలన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలలో గెలిచినా, ఓడిన మీ గ్రామానికి వచ్చి మీతో కలిసి కంపెనీని రద్దు చేయాలని నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, జలంధర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఎర్ర దామోదర్ రెడ్డి, విజయ రెడ్డి, నారాయణరెడ్డి, మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News