మిల్లర్లకు జాప్యం తగదు..అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్

సీఎంఆర్ రైస్ అందించడంలో జాప్యం తగదని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ మిల్లర్ యజమానులను హెచ్చరించారు.

Update: 2023-05-19 12:27 GMT

దిశ, అచ్చంపేట : సీఎంఆర్ రైస్ అందించడంలో జాప్యం తగదని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ మిల్లర్ యజమానులను హెచ్చరించారు. శుక్రవారం ఉప్పునుంతల మండలం ఉప్పరపల్లి గ్రామం వద్ద ఉన్న ఏఎంఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ పారబాయిల్డ్ రైస్ మిల్ ను అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ సందర్శించి పరిశీలించారు. మిల్లులో ఉన్న ధాన్యాన్ని లెక్కించి నివేదికలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో జాప్యం జరగకుండా చూడాలని కోరారు. మిల్లులో ఉన్న ధాన్యం పై పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ప్రతిరోజు 1 ఏసీ కేలు సీఎంఆర్ రైస్ ని అందించాలన్నారు. రైస్ ను సకాలంలో అందించడం, రైతుల నుండి ధాన్యం సేకరణలో జాప్యం జరిగితే చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లర్లతో ఏవైనా సమస్యలు వస్తున్నాయా అని రైతులతో అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు ధాన్యం సేకరణలో ఇబ్బందులకు గురి చేస్తే సమాచారం అధికారులకు అందజేయాలని సూచించారు. ఆయన వెంట జడ్పీటీసీ ప్రతాపరెడ్డి అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News