3 క్వింటాళ్ల బీటీ-3 నకిలీ విత్తనాలు సీజ్..

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ అమాయక రైతులను మోసం చేసే

Update: 2024-05-24 12:30 GMT

దిశ,జడ్చర్ల : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తూ అమాయక రైతులను మోసం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అవసరమైతే పీడీ యాక్టర్లు కూడా నమోదు చేస్తామని ఏ ఎస్పీ రాములు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే వ్యక్తుల వద్ద రైతులకు నకిలీ పత్తి విత్తనాలను అంట కట్టడానికి సిద్ధంగా ఉంచడంతో పక్కా సమాచారం మేరకు వ్యవసాయ మరియు పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ ఉన్న మూడు క్వింటాళ్ల 20 కేజీల నిషేదిత (బీటీ-3) నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం నిందితులను జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గుంటూరు నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ముందస్తు సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు మూడున్నర లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని 17 మండలాల టీం లతో పాటు ఒక జిల్లా బృందం నిరంతరంగా తనిఖీలు చేపడుతుందని వివరించారు. ఈ సందర్భంగా డిఏఓ వెంకటేష్ మాట్లాడుతూ ప్యాకింగ్ చేయని లూజ్ విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దని సూచించారు. డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని ప్రతి దానికి రసీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ ఆదిరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.

Similar News