జేడీ లక్ష్మీ నారాయణ ఓ చదువుకున్న మూర్ఖుడు!.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Update: 2024-05-24 11:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జేడీ లక్ష్మీనారాయణ ఓ చదవుకున్న మూర్ఖుడు అని, ఆయనకు సిగ్గు శరం లేదని వరంగల్ పశ్చిమ నియోజవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లపై నిప్పులు చెరిగారు. మాజీ సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ అంటే తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ నిన్న మొన్న చూసిన వార్తలతో ఆయన మీద గౌరవం పోయిందని అన్నారు. రాకేష్ రెడ్డికి సపోర్టు చేయడానికి సిగ్గు శరం ఉండాలని, ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలో, ఏ పార్టీ బలపరిచిన వ్యక్తులకు చేయాలో తెలియని చదువుకున్న మూర్ఖుడని దుయ్యబట్టారు.

నీతిపరుడని, నిజాయితీ పరుడని చాలా గౌరవం ఉండేదని, కానీ నీలాంటి వ్యక్తులు డబ్బులకు అమ్ముడుపోతున్నరా.. పవర్ కు అమ్ముడు పోతున్నరా అర్ధం కావడం లేదన్నారు. అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కూడా ఆరోపణలు చేశారు. ఆయనే రాజీనామా చేసి ఓ పార్టీలో జాయిన్ అయ్యి మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్లాడని విమర్శలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుమానంగా ఉందని, ఎవరైనా ప్రజలు తిరస్కరించిన పార్టీలోకి వెళ్లి జాయిన్ అవుతారా? అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే అధికారంలో ఉన్నప్పడు వారే ఎంతో కొంత ముట్టజెప్పి కొత్త దుకాణం తెరివమని పంపించి ఉంటారని, తర్వాత మళ్లీ దీంట్లో కలుపుకుంటామని చెప్పి ఉంటారని ఆరోపించారు.

Read More..

AP News:ఎన్నికల కౌంటింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి:పురంధేశ్వరి

Similar News