ప్రధాని మోడీని కలిసిన కోమటిరెడ్డి.. NDA పాలన భేష్ అంటూ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోడీని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసారు.

Update: 2023-03-23 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. జాతీయ రహదారులు, రైల్వే నెట్ వర్క్, విమానాశ్రయాలు, టెక్స్ టైల్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా మౌళిక సదుపాయల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. మెట్రో విస్తరణపై ప్రతిపాదనలు పంపేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందుకు ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీకి ఇచ్చిన వినతిపత్రంలో కోరారు.

అంతే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ ఫేజ్ - 2 ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు పొడిగించాలని ప్రధాని మోడీని కోరారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని విన్నవించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News