వర్షాకాలానికి ముందే మున్నేరు పనులు పూర్తి చేయాలి

ఖమ్మం నగరంలో మున్నేరు బ్రిడ్జిని వర్షాకాలం రాక ముందే పనులు పూర్తి చేయాలని కేబుల్ బ్రిడ్జి సంస్థ ప్రతినిధులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేశించారు.

Update: 2024-04-19 14:44 GMT

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలో మున్నేరు బ్రిడ్జిని వర్షాకాలం రాక ముందే పనులు పూర్తి చేయాలని కేబుల్ బ్రిడ్జి సంస్థ ప్రతినిధులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అదేశించారు. శుక్రవారం ఖమ్మం నగరంలో మంత్రితో కేబుల్ బ్రిడ్జి ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. కేబుల్ బ్రిడ్జి నందు నీటి నిల్వ కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో సమన్వయ చేసుకొని చెక్ డాం నిర్మాణం చేయాలన్నారు. చెక్ డ్యాంతో భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. పాత బ్రిడ్జిని సుందరీకరించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించారు. దాంతో పాటు ట్రాఫిక్ పోలీస్ వారితో సంప్రదించి వారి సలహాలు సూచనల ప్రకారం ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ని నియంత్రించాలన్నారు.  

Similar News