ఆ రెండు పార్టీలు హైద్రాబాద్ లో లూఠీకి ప్రయత్నిస్తున్నాయి

ఆ రెండు పార్టీలు హైద్రాబాద్ లో లూఠీకి ప్రయత్నిస్తున్నాయి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2024-05-24 10:24 GMT

దిశ,సత్తుపల్లి : ఆ రెండు పార్టీలు హైద్రాబాద్ లో లూఠీకి ప్రయత్నిస్తున్నాయి అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సత్తుపల్లి పట్టణంలో స్థానిక ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన నల్లగొండ, ఖమ్మం ,వరంగల్, పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మరో వారంలో జూన్ 10 వ తారీకు రాబోతుందని, ఆ తారీకు తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందన్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజధానులు విడిపోవాలని, కానీ బీజేపీ, కాంగ్రెస్ కలిసి మరో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఉమ్మడి రాజధాని ఏర్పాటును

రాబోయే రోజుల్లో విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కి అధికార ఆంక్ష తప్ప తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆ రెండు పార్టీలు దోహదపడవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో స్థానిక సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఖమ్మం పార్లమెంటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి పెద్ది సుదర్శన్ రెడ్డి, సత్తుపల్లి నియోజకవర్గ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, స్థానిక మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Similar News