దేశం అంతా ఖమ్మం వైపు చూస్తుంది

దేశమంతా ఖమ్మంలో బీజేపీ గెలుస్తుందని, ఖమ్మం వైపు చూస్తుందని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు.

Update: 2024-05-04 11:10 GMT

దిశ, సత్తుపల్లి : దేశమంతా ఖమ్మంలో బీజేపీ గెలుస్తుందని, ఖమ్మం వైపు చూస్తుందని ఖమ్మం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు. శనివారం సత్తుపల్లి స్థానిక ప్రభుత్వాసుపత్రి ఎదుట జిల్లా బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన స్టేట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ఖమ్మం ప్రజలను నాయకులు ఒక్కసారి కానీ రెండు సార్లు కానీ మోసం చేస్తారు‌ కానీ ప్రతి సారి మోసం చేయలేరని అన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ఆగ్రగామిగా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎండిపోయిన, చెదలు పట్టిన చెట్టు వంటిదని ఎద్దేవా చేశారు. గత కొన్నేళ్లుగా ఖమ్మానికి ఎదైనా మంచి కాలేజీ కానీ, పరిశ్రమలు కానీ వచ్చాయా అని అన్నారు. వేల ఎకరాల్లో మిర్చి పండుతున్నా పరిశ్రమలు నెలకొల్పలేదన్నారు. ఖమ్మంలోని యువకుల్లో మంచి మేధావులు ఉన్నారని,

    వారికి ప్రాధాన్యత ఇచ్చారా అని అన్నారు. ఖమ్మం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. నరేంద్ర మోడీ ఓ విజన్ ఉన్న నాయకుడని, ఖమ్మం జిల్లాలో బీజేపీని గెలిపిస్తే గత పది సంవత్సరాల అభివృద్ధి కంటే రెట్టింపు అభివృద్ధి చేసి చూపుతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల వారు ఓట్లకు వస్తే రైతు రుణమాఫీ ఎక్కడ అని నిలదీయాలని సూచించారు. గతంలో జలగం వెంగళరావు ఎలా అభివృద్ధి చేశారో అలానే అభివృద్ధి చేస్తాను అన్నారు. కేంద్ర పెద్దల సహాయ సహకారాలతో ఈ ప్రాంతానికి గోదావరి జాలలు, రైల్వే మార్గం తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు కు నోటు తీసుకోకుండా పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రాంత బిడ్డగా మీలో ఒకడిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశానికి బీజేపీ

     మాజీ మంత్రి విజయ రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కస్టర్ ఇన్చార్జి మారి గాని ధర్మారావు, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వీరపనేని పద్మ, పార్లమెంట్ ప్రచారీ శ్రీకాంత్, పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, సత్తుపల్లి అసెంబ్లీ ప్రచార కార్యదర్శి తిరుపతిరెడ్డి, సత్తుపల్లి కన్వీనర్ భాస్కర్ణి వీరాంరాజు, సత్తుపల్లి కన్వీనర్ చల్లా తిరుమల దేవి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చావా కిరణ్, జిల్లా కార్యదర్శి సుదర్శన్ మిశ్రా, జిల్లా అధికార ప్రతినిధి మధుసూదన్ రావు, స్టేట్ కౌన్సిలింగ్ నెంబర్ మట్టా ప్రసాద్, జిల్లా కిషన్ మోర్చా ఉపాధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు దొడ్డపనేని కృష్ణ, సీనియర్ నాయకులు వందనపు భాస్కరరావు, మండల అధ్యక్షులు పాలకొల్లు శ్రీనివాస్, పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 

Similar News