దేశమంతా మోడీ వైపే చూస్తుంది

దేశమంతా మోడీ వైపే చూస్తుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు బీజేపీకే ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-23 13:57 GMT

దిశ ఖమ్మం టౌన్ : దేశమంతా మోడీ వైపే చూస్తుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు బీజేపీకే ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఖమ్మం నగరంలో ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఓ హోటల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా అని ఇక్కడ ప్రజలు చైతన్యవంతులని, ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి తప్పకుండా వేయాలని పట్టభద్రులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయడం లేదని అన్నారు. నిరుద్యోగులను, పట్టభద్రులను, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంలో ముందుందన్నారు.

    గత ప్రభుత్వం పోకడలే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోతుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రుణమాఫీ చేయలేదని, ఎకరానికి 15 వేలు ఇవ్వలేదని, కౌలు రైతులకు 15 వేలు పడలేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒకప్పుడు బీజేపీ నాయకులేనని, ప్రజలు అది గుర్తుంచుకోవాలని సూచించారు. దేశమంతా మోడీ రావాలని కోరుకుంటున్నారని, పార్టీ కోసం సిద్ధాంతం కోసం దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి పది సంవత్సరాలు కూడా నిరుద్యోగ యువతను మోసం చేసిందని అన్నారు. ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

     జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రామనాథం, బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు, బీజేపీ జిల్లా ఎన్నికల ఇన్చార్జి మారుతిని ధర్మారావు, ఉప్పల శారద, దేవకి వాసుదేవరావు, గెంటాల విద్యాసాగర్ రావు, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News