అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

మండల పరిధిలోని మహాదేవపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

Update: 2024-03-25 15:58 GMT

దిశ, మధిర : మండల పరిధిలోని మహాదేవపురం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. గత 16 సంవత్సరాల నుండి స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

Similar News