త్వరలోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శుభవార్త వింటారు

త్వరలోనే రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పబోతుందని ఖమ్మం, నల్గొండ, వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు.

Update: 2024-05-22 11:44 GMT

దిశ, దమ్మపేట : త్వరలోనే రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ శుభవార్త చెప్పబోతుందని ఖమ్మం, నల్గొండ, వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం దమ్మపేట మండలంలోని గండుగలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ పట్టుభద్రులతో ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శుభవార్త వినబోతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు, పట్టభద్రులకు ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేర్చుతుందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే భూస్థాపితం కాబోతుందని, బీఆర్ఎస్ పార్టీకి కనీసం

    ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా రోజులు అభ్యర్థి కూడా దొరకలేదని అన్నారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వదలకుండా, తనను గెలిపించే బాధ్యత మీదేనని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రుడు దగ్గరికి వెళ్లి వారి మనసులో మాట కనుక్కొని, వారిని ఓటు అడగాలని కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తనకు చేయాల్సిన పని మొత్తం ముందుగానే చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 74 శాతం ఓట్లు రాబోతున్నాయని, ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన గెస్ట్ లెక్చరర్లతో మాట్లాడుతూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీపి కబురు చెప్పబోతున్న అన్నారు. అనంతరం గేస్ట్ లెక్చరర్లు తీన్మార్ మల్లన్నకు ఎన్నికల ఖర్చు కోసం రూ.50 వేల చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామ సహాయం రఘురాంరెడ్డి, జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ నాగ సీతారాములు, పిడమర్తి రవి, స్థానిక నాయకులు కొయ్యాల అచ్యుతరావు, కేవీ సత్యనారాయణ, చిన్నశెట్టి యుగంధర్ పాల్గొన్నారు.

Similar News