Bhadrachalam : భద్రాద్రిలో మళ్లీ రెండవ ప్రమాద హెచ్చరిక

భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతుంది . గురువారం ఉదయం 11 గంటల వరకు 50.50 అడుగులకు చేరి ప్రవహించి, అనంతరం తగ్గుముఖం పట్టిన గోదావరి గురువారం సాయంత్రం 7గంటలకు 47.80 అడుగులకు చేరుకోవడంతో

Update: 2023-07-28 06:46 GMT

దిశ, భద్రాచలం :భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతుంది . గురువారం ఉదయం 11 గంటల వరకు 50.50 అడుగులకు చేరి ప్రవహించి, అనంతరం తగ్గుముఖం పట్టిన గోదావరి గురువారం సాయంత్రం 7గంటలకు 47.80 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహారించారు.అయితే ఎగువనుండి 20 లక్షల క్యూసెక్కుల వరద నీరు తరలి వస్తుండడంతో, శుక్రవారం ఉదయం నుండి మళ్ళీ గోదావరి క్రమంగా పెరుగుతూ.. ఉదయం 10 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటి గోదావరి ప్రవహించే అవకాశం ఉంది.

Tags:    

Similar News