చత్తీస్గడ్ బంద్ నేపథ్యంలో మావోయిస్టుల దుశ్చర్య

మావోయిస్టు బంద్ నేపథ్యంలో చర్ల మండలంలో పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. చెట్లను నరికి రోడ్డుపై వేసి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు.

Update: 2024-05-26 05:49 GMT

దిశ, చర్ల: మావోయిస్టు బంద్ నేపథ్యంలో చర్ల మండలంలో పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. చెట్లను నరికి రోడ్డుపై వేసి బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. బూటకపు ఎన్ కౌంటర్‌ను నిరసిస్తూ.. ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు శనివారం రాత్రి చర్ల మండలం పూసుగుప్ప వద్ధిపేట మధ్యలో రొటెంత వాగు వద్ద చెట్లు నరికి వంతెనకు ఇరువైపులా పడేసారు. బంద్ ను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు వేశారు. అలాగే ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా బీమా పురం గ్రామంలో ఒక ఇంట్లో పోలీసుల కోసం మావోయిస్టులు దాచిన మందుపాతర పేలి ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Similar News