కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం: శ్రీనివాస్ నాయక్

కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు... Kanti Velugu at kusumanchi

Update: 2023-03-23 06:04 GMT

దిశ, కూసుమంచి: కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మండలంలోని గోరీలపాడు తండా గ్రామ పంచాయితీలో గురువారం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ.. కంటి చూపుతో బాధపడేవారు కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సోమవారం నుండి శనివారం వరకు(ప్రభుత్వ సెలవు దినాలు మినహా) ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ నెల 23 నుండి ఏప్రిల్ 3 వరకు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, శిబిరంలో అవసరమైనవారికి మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తారని తెలిపారు.

కంటికి సంబంధించి ఏ సమస్యలున్నా నిర్లక్ష్యం చేయవద్దన్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కంటి వెలుగు శిబిరాలలో కంటి పరీక్షలు చేసుకోవాలని ఎంపీపీ సూచించారు. వైద్య సిబ్బంది కంటి వైద్య పరీక్షలు పూర్తయ్యేవరకు శిబిరం అందుబాటులో ఉంటారని, అందరి భాగస్వామ్యంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన కోరారు. కంటి వెలుగు వైద్య అధికారి షేక్ జానీ ఫాషా, వైద్య సహాయకురాలు సరోజినీ, స్థానిక సర్పంచ్ సరస్వతీ, పంచాయితీ కార్యదర్శి సురేష్, మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల పరశురామ్, ఏఎన్ఎం సుజాత, గ్రామ శాఖ తేజావత్ శ్రీను నాయక్, జీవన్ లాల్, గోపి చందు, చోటి, బాబు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News