కాంగ్రెస్​ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తా

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్ లో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

Update: 2024-05-25 13:46 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం క్లబ్ లో బీజేపీ జాతీయ నాయకులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ఫ్లెయింగ్ స్వ్కాడ్ పేరుతో బీజేపీని ఇబ్బందులకు గురిచేయాలని చూశారని, ఎన్నికల స్వ్కాడ్ అధికార పార్టీ అక్రమాలు, మద్యం, డబ్బు నిలువరిస్తే బీజేపీ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారని అన్నారు. లక్షకోట్ల యజమాని అయిన గుడిసెల్లో ఉన్న వారికైనా ఒకటే ఆయుధం ఓటు అని, ఆ ఓటు సరైన అభ్యర్థికి వేస్తే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అధికార దర్పం ప్రదర్శించిన కేసీఆర్​ను ప్రజలు ఇంటికి పంపారని, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి కి ఆరు నెలలకే అహంకారం నెత్తికెక్కిందని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైనదని తెలంగాణ ఉద్యమంలో పోరాటం మొదలుపెట్టి తూటా దెబ్బలు తిన్నది

    ఈ జిల్లా ప్రజలే అని గుర్తు చేశారు. సమాజం పట్ల పూర్తి అవగాహన కలిగిన పట్టభద్రులు మంచి చేసేదెవరో చెడు చేసేది ఎవరో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అధికార పార్టీ ఎంఎల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక అంటుండు అని, గెలిస్తే అధికార పార్టీ ని ప్రశ్నించగలుగుతాడా అని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ జుట్టులో నుంచి పుట్టాడా అన్నట్టుందని ఎద్దేవా చేశారు. గడిచిన ఆరు నెలల్లో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చాడా అని అన్నారు. హైదరాబాద్ లో ఉన్న భూములు అమ్మినా గత ప్రభుత్వంలో హామీలు హామలు కాలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి మద్యం దొరుకుతుంది కానీ అత్యవసర సేవలైన మందులు దొరకవని, ఒకవైపు తాగిపించి మరోవైపు కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులు

    పెట్టిన ఘనత గత, ప్రస్తుత ప్రభుత్వాలదేనని అన్నారు. నేను నెంబర్ వన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి, కేసీఆర్ 1వ తారీఖు లోపు జీతాలు ఇవ్వలేక పోయారన్నారు. స్వేచ్ఛా భారత్ తెచ్చి 12వేల కోట్ల టాయిలెట్ కట్టించిన ఘనత భారతీయ జనతా పార్టీకే చెందుతుందని అన్నారు. ఫోన్ పే, గూగుల్ పే తెచ్చి డిజిటలైజ్ చేసింది నరేంద్రమోడీ కాదా అని, 10 సంవత్సరాల పరిపాలనలో కొన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మించింది బీజేపీ అని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

Similar News