హరీష్ రావు కాన్వాయ్​ని అడ్డుకున్న రైతులు

జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో రైతులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాన్వాయ్​ను అడ్డుకొని వారి సమస్యలను విన్నవించారు.

Update: 2024-05-24 13:10 GMT

దిశ, తల్లాడ : జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో రైతులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాన్వాయ్​ను అడ్డుకొని వారి సమస్యలను విన్నవించారు. అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతులు ధాన్యానికి బోనస్ ఇవ్వమని అడిగితే కొంతమంది వ్యవసాయం తెలియని వాళ్లు కూడా రైతులను మొరిగే కుక్కలు అని అవమానించారని అన్నారు. ఎన్నికల ముందు వందరోజుల్లో 500 బోనస్​ ఇస్తామని, మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, ఎకరాకు రైతు బంధు 7500, కూలీలకు 12000 ఇస్తామని నమ్మించి మోసం చేశారని తెలిపారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఎలాంటి పథకాలు అమలు కాలేదన్నారు.

    ధాన్యానికి బోనస్​పై మంత్రులు తలోరకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని తెలిపారు. జూన్ నెలలో 7500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తులం బంగారం దేవుడికి ఎరుక ఇకనైనా కళ్యాణ లక్ష్మి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేడ్డం మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ దిరిశాల ప్రమీల, దుగ్గిదేవర వెంకట్ లాల్, దిరిశాల దాసు రావు తదితరులు పాల్గొన్నారు. 

Similar News