దిశ ఎఫెక్ట్… చేతి పంపు మరమ్మతులు చేయించిన అధికారులు

దిశ కథనానికి స్పందించి బాలాపేట గ్రామంలో తాగునీరు లేక ప్రజల ఇబ్బందులతో విలవిలాడుతున్నారనే కథనంతో మిషన్ భగీరథ ఇంట్రా విలేజీ ఏఈ సింధు కథనానికి స్పందించారు.

Update: 2024-05-10 12:47 GMT

దిశ,తల్లాడ: దిశ కథనానికి స్పందించి బాలాపేట గ్రామంలో తాగునీరు లేక ప్రజల ఇబ్బందులతో విలవిలాడుతున్నారనే కథనంతో మిషన్ భగీరథ ఇంట్రా విలేజీ ఏఈ సింధు కథనానికి స్పందించారు. స్థానిక సెక్రటరీ మహేష్ కు ఆదేశాలనుసారం బాలపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల పర్యవేక్షణ ప్రభుత్వ అధికారులకు అప్పచెప్పింది. ఎస్సీ కాలనీలో దాదాపు 50 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నారు. మంచినీటి వినియోగం కోసం ఒక చేతి పంపు మాత్రమే ఉండగా అది కూడా శిథిలమైపోయింది. మురుగునీరు అదే బోర్ లో కలిసిపోవడం వలన బురద నీరు వస్తుండడంతో ప్రజలు నీరు తాగడం వల్లన రోగాలకు గురవుతున్నారని దిశ కథనం మే 1వ తేదీన ప్రచురించడంతో స్పందించిన అధికారులు చేతిపంపును మరమ్మతులు చేయడం ద్వారా తాగునీరు సదుపాయం కల్పించారు. దీంతో అధికారులకు, దిశ పేపర్ యాజమాన్యానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News