అడుగడుగునా నిర్భంధం... నిజాంను తలపిస్తున్న ప్రభుత్వం..

జనగర్జన సభను విఫలం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.

Update: 2023-07-02 07:57 GMT

దిశ, భద్రాచలం : జనగర్జన సభను విఫలం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఆర్టీసీ నుండి బస్సులు ఇవ్వకుండా చేసిన కేసీఆర్, ప్రత్యామ్నాయ వాహనాల పై ద్రుష్టి పెట్టారు. ఆదివారం ఉదయం నుండి వందలాది ఆటోలు, టాటా ఏసీలను డాక్యుమెంట్ పరిశీలన పేరుతో పోలీస్ స్టేషన్ లకు తరలించి కాంగ్రెస్ నాయకులకు అందుబాటులో లేకుండా చేశారు.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలుగ చేసుకుని వాహనాలను విడిపించారు. ఇన్ని రోజులు లేనిది ఈ రోజు కావాలనే ఆటో డ్రైవర్స్ ను ఇబ్బంది పెడుతున్నారని, కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ, నిజాంపాలనను మరిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News