ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ విమర్శించారు.

Update: 2024-05-24 12:41 GMT

దిశ, వైరా : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ విమర్శించారు. వైరాలోని ఠాగూర్ విద్యాలయంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ట్రేస్మా ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ గ్రాడ్యుయేట్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అసమర్ధత వల్లే ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ అయి గ్రాడ్యుయేట్లను నిరుద్యోగులను ఆయన మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా మోసం చేశారని ఆరోపించారు.

     గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. బీఆర్ఎస్ హయాంలో కుటుంబ పాలన నడిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, కొనిజర్ల మండల అధ్యక్షులు వడ్డే నారాయణ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు పమ్మి అశోక్, పొదిలి హరినాథ్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అడ్వైజర్ సంక్రాంతి రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కోణతం ఉమా శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటగిరి ప్రవీణ్, హుస్సేన్, అసోసియేషన్ నాయకులు పోతినేని భూమేశ్వరరావు, మాధవరెడ్డి కోటేశ్వరరావు, ఫ్రెండ్స్ యూత్ క్లబ్ అధ్యక్షులు తాటిపల్లి సుధీర్ పాల్గొన్నారు.

Similar News