భద్రాద్రిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 9వ తేది నుండి ప్రారంభమైన వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి.

Update: 2024-04-23 11:34 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 9వ తేది నుండి ప్రారంభమైన వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజు ఉదయం శ్రీ చక్రానికి పవిత్ర గోదావరిలో చక్ర తీర్ధం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం స్వామి వారికి శేషవాహన సేవ కన్నుల పండువగా సాగింది. అనంతరం ధ్వజారోహనము, దేవతోద్వాసనము, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్ప యాగంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి.

రేపటి నుండి నిత్య కళ్యాణం ప్రారంభం

భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈనెల 9వ తేదీ నుండి నిత్యకళ్యాణాలు నిలిపివేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసినందున బుధవారం నుండి యథావిధిగా నిత్య కళ్యాణం ప్రారంభం అవుతాయి. అలాగే దర్బారు సేవలు సైతం జరగనున్నాయి. 

Similar News