ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్…12 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, గంగలోర్ పిఎస్ పరిధిలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు

Update: 2024-05-10 11:31 GMT

దిశ, భద్రాచలం : ఛతిస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, గంగలోర్ పిఎస్ పరిధిలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. పిడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలు సమావేశం అయ్యారనే ఖచ్చితమైన సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు చతిస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. మృతి చెందిన మావోయిస్టులలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. సంఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News