పెట్రోల్ బంక్ నిర్వాహకులపై కేసు నమోదు

పెట్రోల్ కొలత తక్కువగా వచ్చిందని ఆదివారం ఉదయం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న హెచ్​పీ పెట్రోల్ బంకు వద్ద తిప్పనపల్లికి చెందిన జైలుద్దీన్ ఆందోళన చేశాడు.

Update: 2024-05-26 12:38 GMT

దిశ, కొత్తగూడెం : పెట్రోల్ కొలత తక్కువగా వచ్చిందని ఆదివారం ఉదయం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఉన్న హెచ్​పీ పెట్రోల్ బంకు వద్ద తిప్పనపల్లికి చెందిన జైలుద్దీన్ ఆందోళన చేశాడు. ఈ విషయం పై ఫిర్యాదు అందుకున్న జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కె. మనోహర్ పెట్రోల్ బంకుకి చేరుకొని తనిఖీ చేశారు. సుమారు ఒక గంట పాటు ఆయన బంకులోని మెషిన్లను, సీసీ కెమెరాలను తనిఖీ చేశారు.

    పెట్రోల్ తక్కువగా పోశారని గుర్తించారు. మిషన్లలో ఎటువంటి లోపం లేదని, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించి, రీడింగ్ జీరో చేయకుండా పెట్రోల్ కొట్టడం వలన వినియోగదారుడికి నష్టం జరిగిందని ఆయన అన్నారు. శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ పై కేసు నమోదు చేశారు. ప్రతి వినియోగదారుడు పెట్రోల్, డీజిల్ కొట్టించుకునే సమయంలో మీటర్ జీరో రీడింగ్ చెక్ చేసుకోవాలని ఆయన తెలిపారు.

Similar News