Republic Day వేడుకల్లో గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.

Update: 2023-01-26 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి అందరం కృషి చేయాలని కోరారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాదామని పిలుపునిచ్చారు. కొత్త భవనాలు నిర్మించడం, ఫామ్‌హౌజ్‌లు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని, సగటువారి ఆకాంక్షలు నెరవేరాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో తన పాత్ర తప్పకుండా ఉంటుందని వెల్లడించారు. నిజాయితీ, ప్రేమ, హార్డ్‌వర్క్ నా బలమని గవర్నర్ వ్యాఖ్యానించారు. తెలంగాణతో తనకున్న బంధం మూడేళ్లు కాదని, పుట్టుకతోనే తనకు ఈ రాష్ట్రంతో బంధం ఏర్పడిందని అన్నారు. కొందరికి తాను నచ్చకపోవచ్చు.. ఎవరికీ నచ్చకపోయినా తెలంగాణ ప్రజల అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూనే ఉంటానని తెలిపారు.

Also Read....

ప్రజాస్వామిక పాలనతోనే రాజ్యాంగం ఆశించిన లక్ష్యం: సీఎం కేసీఆర్ 

Tags:    

Similar News