ముస్లిం రిజర్వేషన్లపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాట్ కామెంట్స్

ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతలు చేస్తోన్న కామెంట్స్‌కు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2024-05-24 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతలు చేస్తోన్న కామెంట్స్‌కు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయస్థానంలో విచారణలో ఉన్న సమయంలో ఈ అంశంపై ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. అసలు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ఎలా చెబుతారని ఫైర్ అయ్యారు. ముస్లింలలో అందరికీ రిజర్వేషన్లు లేవని.. ఆ కమ్యూనిటీలోని వెనకబడిన వర్గాల వారికి మాత్రమే ఉన్నాయని అన్నారు.

ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడుతూ.. మోడీ, అమిత్ షా హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు కల్పిస్తోన్న 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లింలకు కాంగ్రెస్ కల్పిస్తోన్న 4 శాతం మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ అగ్రనేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తోన్న విషయం తెలిసిందే.

Similar News