గ్రాడ్యుయేట్ MLC: ‘తీన్మార్ మల్లన్నకు భారీ మెజార్టీ ఖాయం’

నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Update: 2024-05-25 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి పార్టీలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తీన్మార్ మల్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇవాళ్టితో ప్రచార ప్రక్రియ పూర్తవుతోందన్నారు.

ప్రజాస్వామ్యం బతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలని చెప్పారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని ఇప్పటికే చేసినట్లు తెలిపారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్‌ను గెలిపించాలి అన్నారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News