KCR లిల్లీపుట్ మాటలు మానుకోవాలి.. మల్లురవి సెటైర్లు

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లురవి సెటైర్లు వేశారు.

Update: 2024-04-17 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లురవి సెటైర్లు వేశారు. కేసీఆర్ అహంకారంతో తెలంగాణ దివాళా తీసిందన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అయిందని.. కేసీఆర్ వెనక ఎవ్వరూ లేరన్నారు. అందరూ రేవంత్ నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారన్నారు. కవితను జైలు నుంచి విడిపించుకునేందుకు.. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. కేసీఆర్ లిల్లీపుట్ మాటలు మాని బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలని సూచించారు. అయితే మంగళవారం అందోలు మండలం సుల్తాన్ పూర్ బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారని కేసీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే.


Similar News