కావ్య నిర్ణయమే కరెక్ట్!.. ఎస్ఆర్‌హెచ్ టీం ఓనర్ పై ప్రశంసలు

ఐపీఎల్ లో మొన్న జరిగిన క్వాలిఫైయర్-2 లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్ కు చేరుకుంది.

Update: 2024-05-26 08:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ లో మొన్న జరిగిన క్వాలిఫైయర్-2 లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచి ఫైనల్ కు చేరుకుంది. ఇవ్వాళ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో కోల్ కత్తా నైట్ రైడర్స్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది. ఎస్ఆర్ హెచ్ మొదట కాస్త తడబడినా తర్వాతి మ్యాచ్ లలో అద్భుతంగా రాణించి తుది పోరుకు చేరుకుంది. ఈ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి ఎస్ఆర్ హెచ్ ఓనర్ కావ్య మారన్ తీసుకున్న నిర్ణయాలేనని ఆమె పై ప్రశంసలు కురుస్తున్నాయి. వేలం సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయం టీమ్ తలరాతనే మార్చేసింది. పాట్ కమిన్స్ కోసం ఆమె దూకుడు చూసి ప్రాంచైజీ ఓనర్లు నవ్వుకున్నారు. పాట్ కమిన్స్ కోసం ఎందుకు అంత ధర పెడుతుందని సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ చేశారు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో పాట్ కమిన్స్ ను 20.5 కోట్ల భారీ ధరతో ఎస్ఆర్‌హెచ్ టీం ఓనర్ కావ్య మారన్ దక్కించుకున్నారు. ఇది ఆ సీజన్ లో అత్యధిక ధర స్టార్క్ తర్వాత రెండో స్థానం కమిన్స్ కే దక్కింది.

ఈ నిర్ణయం పై చాలా మంది నవ్వుకున్నారు. వన్డే వరల్డ్ కప్ గెలిపించినందుకు అంత ధర పెట్టాలా ఇది టీ20 అని మర్చిపోయిందా అని హేళన చేశారు. కానీ కమిన్స్ పై కావ్య పెట్టుకున్న నమ్మకమే నిజం అయ్యింది. అతని కెప్టెన్సీ నే ఎస్ఆర్ హెచ్ ను ఫైనల్ కు తీసుకెళ్లింది. 2023 లో చివరి స్థానాల్లో ఉన్న టీమ్ ఇప్పడు ఏకంగా తుది పోరులో తలపడనుంది. వీటన్నింటికీ కారణం ఎస్ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ నిర్ణయమేనని ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీం ను సపోర్ట్ చేస్తు మైదానంలో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కమిన్స్ ను నమ్మి తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో కావ్య మారన్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కమిన్స్ ను అంత ధర పెట్టి కొన్నప్పుడు నవ్విన వారే ఎస్ఆర్ హెచ్ ఆట తీరు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా ఇవ్వాళ చెన్నై వేధికగా ఐపీఎల్ -2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు మొదలు కాబోతుంది.    

Tags:    

Similar News