జలమయమైన ఆదర్శ పాఠశాల.. వసతి గృహంలో చిక్కుకున్న 60 మంది విద్యార్థులు

బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సైదాపూర్, వెన్కెపల్లి, దుద్దెనపల్లి, ఆకునూర్, పెర్కపల్లి గ్రామాల నుంచి వరద నీరు భారీగా రావడంతో సోమారంలోని ఆదర్శ పాఠశాల జలమయమైంది.

Update: 2023-07-27 06:44 GMT

దిశ, సైదాపూర్: బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సైదాపూర్, వెన్కెపల్లి, దుద్దెనపల్లి, ఆకునూర్, పెర్కపల్లి గ్రామాల నుంచి వరద నీరు భారీగా రావడంతో సోమారంలోని ఆదర్శ పాఠశాల జలమయమైంది. ఆదర్శ పాఠశాల వసతి గృహంలో ఉన్న సుమారు 60 మంది విద్యార్థినిలు వసతి గృహంలో చిక్కుకుపోయారు. వసతి గృహంలో చిక్కుకుపోయిన విద్యార్థినులను సైదాపూర్ ఎస్సై తన సిబ్బందితో పాటు స్థానికుల సహాయంతో గురువారం విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఒడ్డుకు చేర్చారు.

మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చెరువులు కుంటలు మత్తడి దూకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. సైదాపూర్-మొలంగూర్, సోమారం-ఎక్లాస్పూర్, ఎలా బోతారం-గొడిశాల తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటి సారి.

Read More :   వరదలో చిక్కుకున్న 1200 మంది మోరంచపల్లి గ్రామస్తులు (వీడియో) 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News