పిల్లల అనారోగ్య పరిస్థితి చూడలేక తల్లి ఆత్మహత్య..

సంపాదించిన డబ్బు మొత్తం పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకే ఖర్చుపెట్టినా, వారి ఆరోగ్యం బాగు కాకపోవడంతో ఓ తల్లి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో చోటుచేసుకుంది.

Update: 2023-02-11 15:07 GMT

దిశ, మెట్ పల్లి: సంపాదించిన డబ్బు మొత్తం పిల్లల ఆరోగ్యం మెరుగుపరిచేందుకే ఖర్చుపెట్టినా, వారి ఆరోగ్యం బాగు కాకపోవడంతో ఓ తల్లి మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఉమాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన బోదాసు సోనీ (26) కి ఇద్దరు కుమారులు. వారు అనారోగ్య సమస్యతో జన్మించారు.

ఎన్ని హాస్పిటల్లో చూయించినా వారి ఆరోగ్య మెరుగు పడలేదు. దీంతో తన పిల్లలను అనారోగ్య పరిస్థితిలో చూడలేక తీవ్ర మనోవేదనకు గురైన సోనీ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News